![]() |
![]() |

ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఐతే ఈ షోలో కావ్య తనకు కాబోయే వాడి గురించి చెప్పింది.. 30 ఏళ్ళ వయసుండాలని చెప్పింది. ఎందుకంటే కావ్య తన వయసు ఇప్పుడు 27 అని చెప్పింది. ఇక హైట్ ఐతే 6.2 అడుగులు ఉండాలని, 100 కేజీల బరువుతో, నటుడు కాకుండా ఎవరైనా పెళ్ళికి పర్లేదు అని చెప్పింది. తర్వాత "కావ్య మీ ఆయనకు శాలరీ ఎంత ఉండాలి" అని శ్రీముఖి అడిగింది" దానికి హరి "అన్ లిమిటెడ్ లవ్" అనేసరికి "మరి ఫుడ్డు ఎవరు పెడతారు" అంటూ కావ్య అడిగింది.
అలాగే మంచి మనసు ఉండాలి ...నెలకు 3 లక్షల జీతం సంపాదించాలని ఆ డబ్బు మొత్తం తనకే ఇవ్వాలని చెప్పింది. ఇంతలో శ్రీముఖి "నెలకు మూడు లక్షలు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు కదా" అనేసరికి "అడ్రెస్ పంపండి" అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపించింది. "అడ్రస్ తెలుసు ఎక్కడ ఉంటారో తెలుసు అన్నీ తెలిసీ రావడం లేదు" అని శ్రీముఖి వెతకరించింది. "కానీ డబ్బు ఉండాలి ఇవ్వడానికి" అంటూ కావ్య కూడా అనేసింది..దానికి శ్రీముఖి "డబ్బు లేదా" అని అడిగింది "ఉన్నా వద్దులే" అని కావ్య చెప్పేసింది. అలాగే "నాకు కాబోయే వాడు క్లాసీగా ఉండాలి ..గడ్డం లైట్ గా ఉంటే బాగుంటుంది. చిల్లరగా బిహేవ్ చేయకుండా ఉండాలి. పాస్ట్ లో ఎన్ని స్టోరీస్ ఐనా ఉండనివ్వండి కానీ మేము అతని లైఫ్ లోకి వెళ్ళాక మళ్ళీ అవి రిపీట్ కాకూడాదు కొత్తవి క్రియేట్ అవ్వకూడదు...ఇక నన్ను చేసుకోబోయేవాడు తానూ మాత్రమే కాదు వాళ్ళ ఫామిలీ కూడా అమ్మాయికి అమ్మాయి ఫామిలీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి.." అంటూ చెప్పింది కావ్య.
![]() |
![]() |